రేపు అమిత్ షా రాక

Amithsha Telangana tour

Mar 11, 2024 - 13:31
 0
రేపు అమిత్ షా రాక

నా తెలంగాణ, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వారియర్స్ తో  సమావేశం అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియం లో జరుగే బీజేపీ పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులు ఆపై స్థాయి నాయకులతో విజయ సంకల్ప సభ సమ్మేళనం లో పాల్గొంటారు. అమిత్ షా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్,  జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ లు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ రాష్ట్ర పదాధికారులు తదితరులు పాల్గొంటారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.