భక్తి, విశ్వాసాలున్నవారంతా మేళాకు ఆహ్వానితులే

సీఎం యోగి ఆదిత్యనాథ్​

Jan 10, 2025 - 12:55
 0
భక్తి, విశ్వాసాలున్నవారంతా మేళాకు ఆహ్వానితులే

లక్నో: మహాకుంభ్​ లో భక్తి, విశ్వాసాలు ఉన్న వారెవరైనా కులమతాలకతీతంగా పాల్గొనవచ్చని సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. ముస్లింలకు కుంభమేళాలో ప్రవేశం లేదన్న వార్తలపై యోగి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. భారతీయ సనాతన సంప్రదాయాలపై గౌరవం ఉన్న ఎవ్వరైనా ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. కానీ దుష్టమనస్తత్వంతో ఉన్నవారెవరైనా ఈ మేళాకు రాకపోవడమే మంచిదన్నారు. ఈ మేళాకు వచ్చేవారెవరైనా తనకు తాను భారతీయునిగా భావించాలన్నారు. కల్కండ్​ లోని ముస్లింల గోత్రం ఇప్పటికే భారత్​ ఋషుల పేర్లతో ఉందని గుర్తు చేశారు. వారు ఇందుకు గర్వపడుతున్నారని అన్నారు. ముస్లింలను అనుమతించబోం అనే వార్తలు ఉత్తవే అన్నారు. ఈ మేళాతో కుల, మతాల గోడలు కనుమరుగు కావాలని వివక్షకు తావులేదన్నారు. ఈ మేళా ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్​ ప్రపంచాన్ని మొత్తం ప్రధాని మోదీ చెప్పినట్లుగా వసుదైక కుటుంబంగా భావిస్తుందన్నారు. భారత్​–మారిషస్​  గురించి మాట్లాడుతూ.. అక్కడ గంగ చెరువు ద్వారా గంగానది స్మృతిని కాపాడుకున్నారని అన్నారు. అందుకే మారిషస్​ ప్రధానిని కూడా వారణాసి పర్యటనకు ఆహ్వానించామని, సంగమ స్నానం చేయాలని కోరామని సీఎం యోగి స్పష్టం చేశారు. కుంభమేళాను ప్రపంచదేశాలు గర్వించేలా, శాంతియుతంగా నిర్వహించాలన్నదే తమ అభిమతమన్నారు. చెడు దృష్టి ఉన్న వారు ఈ మేళాకు రాకుండా ఉంటేనే మంచిదన్నారు. తమ చర్యలకు పని చెప్పొద్దన్నారు.