సంభాల్ బావి వద్ద పూజలపై నిషేధం
Ban on worship at Sambhal Bavi
నీటిని అందరూ వినియోగించుకోవాలి
కేసు ఫిబ్రవరి 21కి వాయిదా వేసిన సుప్రీం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సంభాల్ కేసులో మసీదు బయట ఉన్న బావి వద్ద పూజలపై సుప్రీంకోర్టు నిషేధాన్ని విధించింది. అదే సమయంలో బావిని నీటి కోసం ఉపయోగించుకోవచ్చని సూచించింది. శుక్రవారం ఈ కేసుపై ప్రభుత్వం, ముస్లిం పక్షం వాదనలను విన్న సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. బావి వద్ద పూజలకు అనుమతిస్తూ మునిసిపాలిటీ ఓకే చెప్పింది. దీనిపై ముస్లింపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో సంభాల్ లో వెలికితీసిన అన్ని బావుల వద్ద పూజలకు అనుమతించింది. సుప్రీం అనుమతి లేకుండా ఈ బావిపై ఎలాంటి నిర్ణయం స్థానిక జిల్లా యంత్రాంగం తీసుకోరాదన్నారు.
ముస్లింపక్షం ఆరోపణలు: యూపీ ప్రభుత్వం శాంతి వాతావరణాన్ని చెడగొడుతుందన్నారు. బావి వద్ద పూజలు జరిపితే ఉద్రిక్తలకు కారణం కావచ్చని పేర్కొంది. బావిలోని నీటిని ఉపయోగించుకుంటామన్నారు.
ప్రభుత్వం వాదనలు: మసీదు కమిటీ చెబుతున్న బావి ఆలయానికి చెందిన, ప్రజలకు చెందిన బావి. ఇక్కడ పూజలు జరుపుకోనీయాలి, అలాగే బావి నీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
సుప్రీంకోర్టు: ప్రభుత్వం రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలి. బావిలో నీటి అందరూ వినియోగించుకోవాలి.