నా తెలంగాణ, మెదక్: సభ్యత్వ నమోదులో ప్రతీఒక్క కార్యకర్త కీలకపాత్ర పోషించాలని జిలా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. బుధవారం మెదక్ లోని ఎన్జీవోస్ భవన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళీ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సభ్యత్వ నమోదులో ముందువరుసలో నిలవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు. జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో సభ్యత్వ నమోదు అత్యంత ప్రభావం చూపుతుందన్నారు. మోదీ నేతృత్వలో ప్రపంచమంతా దేశం వైపు చూస్తోందని డాక్టర్ మురళీ గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రఘువీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్షిలు ఎంఎల్ ఎన్ రెడ్డి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి వెలుముల మహేశ్వరి, మోర్చాల జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, గడ్డం కాశి సీనియర్ నాయకులు రాగి రాములు వివిధ మండలాల అధ్యక్షులు నాయిని ప్రసాద్, పోగుల రాజు, రంజిత్ రెడ్డి, ప్రభాకర్, బి. రాములు, చంద్రశేఖర్, భాను, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.