దిగొచ్చిన కాంగ్రెస్​

జర్నలిస్టుపై దాడులు సహించం శ్యామ్​ పిట్రోడా క్షమాపణలు

Sep 15, 2024 - 20:09
 0
దిగొచ్చిన కాంగ్రెస్​

డల్లాస్​ లో ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరిపై దాడులు
మొబైల్​ ఫోన్​ లాక్కెళ్లిన దుండగులు
మీడియాలో వైరల్​ తో దిగొచ్చిన హస్తం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అమెరికాలో జర్నలిస్టుపై అనుచిత ప్రవర్తన, దాడిపై ఎట్టకేలకే కాంగ్రెస్​ పార్టీ దిగి వచ్చింది. ఆ పార్టీ సీనియర్​ నాయకుడు శ్యామ్​ పిట్రోడా ఆదివారం క్షమాపణలు చెప్పక తప్పలేదు. అమెరికాలో రాహుల్​ గాంధీ మీడియా సమావేశానికి ముందు ఓ జర్నలిస్టు బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆయనను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించి చితకబాదారని రోహిత్​ శర్మ అనే జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాక తన మొబైల్​ ఫోన్​ ను కూడా లాక్కున్నారని పేర్కొన్నాడు. గత మూడు, నాలుగు రోజులుగా ఈ ఘటన కాస్త వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో వరుస కథనాలు ప్రసారితం అవుతుండడంతో కాంగ్రెస్​ పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు ఇంటర్వ్యూలో రాహుల్​ వ్యాఖ్యలపై కూడా పార్టీలోని సీనియర్​ నాయకులు సైతం అంతర్గతంగా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టుకు భేషరతుగా పిట్రోడాతో క్షమాపణలు చెప్పించింది. ఈ సందర్భంగా శ్యామ్​ పిట్రోడా మాట్లాడుతూ.. డల్లాస్​ లో జర్నలిస్టు ఘటనపై నిరాశను వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛ, నిబద్ధతపై దాడులు సహించబోమన్నారు. 

 `