ఏఆర్​ రెహ్మాన్​ కు అస్వస్థత

చెన్నై అపోలోలో చికిత్స, డిశ్చార్జ్​ 

Mar 16, 2025 - 12:22
Mar 16, 2025 - 16:04
 0
ఏఆర్​ రెహ్మాన్​ కు అస్వస్థత

చెన్నై: ప్రముఖ సినీ సంగీతకారుడు ఏఆర్​ రెహ్మాన్​ అనారోగ్యం కారణంగా ఆదివారం ఉదయం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరాడు. రంజాన్​ మాసం ఉపవాస దీక్షలు పాటిస్తుండడంతో డీహైడ్రేషన్​ కు గురై, ఛాతినొప్పి తదితర కారణాలతో ఆయన ఆరోగ్యం క్షీణించి ఉండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. రెహ్మాన్​ కు యాంజియోగ్రఫీ చేశామన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించాక ఆయనకు విశ్రాంతి అవసరంగా పేర్కొన్నారు. దీంతో స్వల్పకాలిక చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జీ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆయనకు అనారోగ్యానికి గురవ్వడంతో అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు కుమారుడు వెల్లడించారు. ప్రస్తుతం తన తండ్రి  అభిమానుల ప్రేమానురాగాలతో ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం లండన్​ లో ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు.