మోస్ట్​ వాంటెడ్​ ఖతల్​ ఖతం!

Most Wanted is finished!

Mar 16, 2025 - 12:25
 0
మోస్ట్​ వాంటెడ్​ ఖతల్​ ఖతం!

సయీద్​ ముఖ్య అనుచరుడు
జమ్మూకశ్మీర్​ దాడుల్లో మాస్టర్​ మైండ్​
పలు కేసుల్లో ఎన్​ ఐఎ చార్జీషీట్​ దాఖలు

ఇస్లామాబాద్​: భారత్​ లో పలుదాడుల్లో మోస్ట్​ వాంటెడ్​ గా ఉన్న పాక్​ లష్కరే తోయిబా ఉగ్రవాది, హఫీజ్​ సయీద్​ కు సన్నిహితుడు అబూ ఖతల్​ (జియా ఉర్​ రెహ్మాన్​) హతమయ్యాడు. అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్థరాత్రి కాల్పులకు పాల్పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. హఫీజ్​ సయీద్​ మరణించాడని తొలుత అంతా భావించారు. తరువాత మృతి చెందింది ఖతల్​ గా నిర్దరించారు. పంజాబ్​ విశ్వవిద్యాలయం సమీపంలో అతని కాన్వాయ్​ వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఖతల్​ తోపాటు ఒక గార్డు మృతి చెందాడు. మరో గార్డుకు తీవ్రగాయాలయ్యాయి. అతనిపై కాల్పులు జరుపుతున్నప్పుడు అతని చుట్టూ 20 మంది వరకు పాక్​ ఆర్మీకి చెందిన సైనికులు ఉన్నారు. దాడి జరుగుతున్నప్పుడు వారు కూడా అతన్ని కాపాడలేకపోయారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరుపొందిన వారికి పాక్​ ఆశ్రయం ఇవ్వడం, భద్రత కల్పించడం నిజమేనని దీంతో మరోమారు నిరూపితం అవుతుంది. 

కాగా జమ్మూకశ్మీర్​ లో జరిగిన అనేక దాడుల్లో ఇతని హస్తం ఉంది. హఫీజ్​ సయీద్​ ఆదేశాలతో ఇతను ప్రణాళికలు రూపొందించేవాడు. దాడులకు ఉగ్రవాదులను ఉసిగొలిపేవాడు. ఎన్​ ఐఎ లిస్టులో మోస్ట్​ వాంటెడ్​ గా ఉన్నాడు. 26/11 ముంబాయి ఉగ్రదాడిలో కూడా ఇతని హస్తం ఉన్నట్లు ఇంటలిజెన్స్​ పేర్కొంది. గతేడాది జూన్​ 9న రియాసీ శివఖోడి ఆలయం యాత్రికుల బస్సుపై దాడి, 2023 రాజౌరి దాడి, ఇలా అనేక దాడులకు ఇతనే మాస్టర్​ మైండ్​ గా వ్యవహరించినట్లు ఎన్​ ఐఎ గుర్తించింది. ఆయా కేసుల్లో ఇతనిపై ఎన్​ ఐఎ చార్జీషీట్​ కూడా దాఖలు చేసింది. కాగా 2023లో ఖతల్​ కు అత్యంత దగ్గరివారైన రియాజ్​ అహ్మద్​, అద్నాన్​ అనే ఉగ్రవాదులు కూడా గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు.