పవన్​ వ్యాఖ్యలపై డీఎంకే గరం గరం

ఎవరైనా చెప్పండి ప్లీజ్​: ప్రకాశ్​​ రాజ్​

Mar 15, 2025 - 18:58
 0
పవన్​ వ్యాఖ్యలపై డీఎంకే గరం గరం

నా తెలంగాణ, హైదరాబాద్​: ప్రముఖ నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ తమిళనాడుపై చేసిన వ్యాఖ్యలపై అగ్గిరాజేసుకున్నట్లు కనబడుతుంది. జనసేన వ్యవస్థాపక దినోత్సవంలో హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడుపై, డీఎంకే నేతలపై పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో శనివారం పలువురు సినీ, రాజకీయ వర్గాలు పవన్​ కళ్యాణ్​ వ్యాఖ్యలు అర్థరహితమని ప్రకటించారు. సోషల్​ మాధ్యమంగా కూడా వేల సంఖ్యలో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పవన్​ హిందీ భాషను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. తమిళ సినిమాలను హిందీ భాషలో డబ్​ చేస్తూ ఉత్తరాది రాష్​ర్టాల నుంచి నిర్మాతలు కోట్లు ఆర్జిస్తున్నారని అన్నారు. కాగా పవన్​ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు వ్యాఖ్యనిస్తూ తాము హిందీని వ్యతిరేకించడం లేదని, ఆ భాషను తమపై రుద్దవద్దు అని మాత్రమే అంటున్నామని వివరించారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్​ రాజ్​ ఒక అడుగు ముందుకు వేసి మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమేనని చెప్పారు. పవన్​ కళ్యాణ్​ కు ఎవరైనా చెప్పాలి ప్లీజ్​ అంటూ ట్వీట్​ చేశారు.