సామాన్యుల పురోగతిని ప్రతిబింబించే బడ్జెట్

​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Feb 1, 2025 - 15:13
 0
సామాన్యుల పురోగతిని ప్రతిబింబించే బడ్జెట్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర బడ్జెట్​ లో దేశ ప్రగతి ఊతం, అన్ని వర్గాలపై సమదృష్టితో వ్యవహరించామని సామాన్యుల పురోగతితోపాటు దేశ పురోగతిని ఊహించిన విడుదల చేసిన బడ్జెట్​ ఎంతో బాగుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం బడ్జెట్​ అనంతరం మీడియాతో తన సందేశాన్ని పంచుకున్నారు. రూ. 12 లక్షల వరకు పన్ను తగ్గింపును ప్రశంసించారు. ఈ నిర్ణయం వల్ల సామాన్యుల పొదుపు, పెట్టుబడులు, వృద్ధి, వినియోగాలు పెరుగుతాయ్నారు. దేశ ప్రజలకు బలమైన పునాదిరాయిలా ఈ బడ్జెట్​ నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అణుశక్తి రంగంలో ప్రైవేట్​ రంగాన్ని ప్రోత్సహించే నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఉపాధి రంగాలకు అన్ని విధాలుగా  ప్రాధాన్యతనిచ్చామన్నారు. భారత్​ లో పెద్ద నౌకల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. పర్యాటక రంగంలో ఉపాధి రెట్టింపు అవుతుందని, దేశ వారసత్వ సంపద మంత్రానికి బడ్జెట్​ లో అధిక ప్రాధాన్యం లభించడం సంతోషకరమన్నారు. కోటి మాన్యుస్ర్కిప్టుల పరిరక్షణ కోసం వినన్​ భారత మిషన్​ ప్రారంభించామన్నారు. ఈ బడ్జెట్​ మహిళలు, యువత, సామాన్యులు, రైతుల ఆర్థికాభివృద్ధిని ఆకాంక్షించేదన్నారు. వ్యవసాయరంగం, గ్రామీణ వ్యవస్థలో నూతన విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. పారిశ్రాకి, ఎంఎస్​ ఎంఇ రంగాల బలోపేతానికి కేటాయింపులు వంటివి కల్పించడం హర్షణీయమన్నారు. మొత్తానికి 2025–26 బడ్జెట్​ తయారీ అన్ని వర్గాలకు, దేశాభివృద్ధికి రానున్న సమయంలో భారత్​ బలమైన శక్తిగా అవతరించేందుకు ఊపునిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.