ఖేలో ఇండియాకు రూ. 1000 కోట్లు!

Khelo India Rs. 1000 crores!

Feb 1, 2025 - 15:33
 0
ఖేలో ఇండియాకు రూ. 1000 కోట్లు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఖేలో ఇండియా’కు బడ్జెట్​ లో గతంకంటే అధిక కేటాయింపులు దక్కాయి. రూ. 1000 కోట్లను కేటాయించారు. గతేడాది ఈ పథకానికి రూ. 900 కోట్లు కేటాయింపులు అందాయి. ఈ పథకం కింద గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని అట్టడుగు స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం, యువతకు క్రీడలపై ఆసక్తిని పెంచడం, క్రీడా సంస్కృతిని మరింత పెంపొందించడం కోసం కృషి చేస్తున్నారు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ. 880 కోట్లను కేటయించారు. 2022–23లో రూ. 596.39 కోట్లు కేటాయించారు.