మోదీ, ట్రంప్ లకు పుతిన్ కృతజ్ఞతలు!
Putin thanks Modi and Trump!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు, వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ఈ మూడు దేశాల ప్రముఖులు అనేకసార్లు యుద్ధ విరమణకు ప్రయత్నిస్తూనే శాంతి, సామరస్యాన్ని కాపడడానికి ప్రయత్నించారన్నారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి గౌరవం ఇచ్చారని కొనియాడారు. దీంతో ఉక్రెయిన్ తో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై కట్టుబడి ఉంటామన్నారు. తమ ముందున్న లక్ష్యం ఒక్కటేనన్నారు. శత్రుత్వాన్ని అంతం చేయడం, ప్రాణనష్టాన్ని నివారించడం, ఆస్థి నష్టాలను ఇకపై జరగకుండా చూసుకుంటామన్నారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ప్రతిపాదనలతో తాను కట్టుబడి ఉన్నానన్నారు. శాంతిని తీసుకురావాలని, సంఘర్షణలకు కారణమవుతున్న కారణాలను పూర్తిగా పరిష్కరించే దిశగా ఈ మూడు దేశాల నాయకులు చేస్తున్న కృషిని కొనియాడారు. కాగా రష్యా–ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ఇంకా చర్చలు కొనసాగుతుండడం విశేషం.