అన్సారీ ఇంత ద్రోహమా!

Is Ansari such a traitor?

Mar 14, 2025 - 13:17
 0
అన్సారీ ఇంత ద్రోహమా!

ఇరాన్​ కు దేశ అణు రహాస్యాలు 
పాక్​ ఐఎస్​ ఐకి రా వివరాలు
అంతర్జాతీయ సమాఖ్యలో భారత్​ పై విషం
ప్రముఖ పత్రికల్లోనూ హెడ్డింగ్​ లతో వార్తలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత విచ్ఛిన్నానికి, దేశద్రోహానికి పాల్పడిన వారి సంఖ్య లెక్కలో లేదనే చెప్పాలి. పైగా ఇలాంటి వారితో నేరుగా కాంగ్రెస్​ పార్టీకి సంబంధం ఉండడం దురదృష్టకరం. ఈ విషయం పాతదే అయినా, ప్రస్తుతం సోషల్​ మాధ్యమంగా ఈ అంశం బాగా ట్రోల్​ అవుతుంది. అదే మాజీ ఉపరాష్ర్టపతి హమీద్​ అన్సారీ. ఇతనిపై వచ్చిన, వస్తున్న ఆరోపణలపై వస్తున్న వార్తలు నిజాలేనని నిరూపిస్తున్నాయి. 

దేశ నిఘా వ్యవస్థల సమాచారాన్ని రహాస్యంగా ఇరాన్​ తో పంచుకొని, రా గూఢాచార సంస్థ ప్లాన్​ లను ముందే లీక్​ చేసి అందులో పనిచేస్తున్నవారి వివరాలను కూడా శత్రుదేశాలకు అందించి వారి చావులకు కూడా కారణమయ్యాడీ ఘనుడు. అతని చీకటి రహాస్యాలు చూస్తుంటే ఇంతటి దేశద్రోహమా? అనక మానడు ప్రతీ ఒక్క భారతీయుడు.

ఇరాన్​ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలో భారత్​ వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ఆయన ప్రశ్నించారు. అంతేగాక దేశ అణు సమాచారాన్ని ఇరాన్​ కు అందించింది అన్సారీయే. పాక్​ కు చెందిన ఓ ఐఎస్​ఐ ఏజెంట్​ తో 2005 నుంచి 2011 వరకు ఐదుసార్లు కలిశాడు. ఈ విషయం లీక్​ కావడంతో అబ్బేబ్బే తానేమీ కలవలేదన్నారు. చివరకు ఆ ఏజెంటే నేరుగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టాడు. వీరికి భారత ఇంటలిజెన్స్​ సంస్థ రా చేపడుతున్న ఆపరేషన్​ లు వివరాలు, వ్యక్తుల పేర్లను అందించాడు. ప్రధాని నరేంద్ర మోదీపై అనేకసార్లు అవాకులు, చవాకులు పేలాడు. 

భారత రాయబారిగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న సమయంలో, హమీద్ అన్సారీ తరచుగా పాకిస్తాన్‌ను సందర్శించేవాడు - పాకిస్తాన్ ఐఎస్ఐలోని కీలక వ్యక్తులను కలుసుకునేవాడు మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లోని భారత వ్యతిరేక ఉగ్రవాదులతో రహస్య సమావేశాలు కూడా నిర్వహించేవాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, అన్సారీ భారత రాయబారిగా ఉన్నప్పటికీ, దేశానికి వ్యతిరేకంగా చురుకుగా పనిచేస్తున్నాడు మరియు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఇరాన్​ నిఘా ఏజెన్సీ సావక్​ (ఎస్​ఎవీఎకే)తో నిఘా రహస్యాలను కూడా పంచుకుంటున్నాడు. దీంతో అప్పట్లో ఇరాన్​ ఏజెన్సీ పలువురు రా ఏజెంట్లను కిడ్నాప్​ చేసింది. వీరికి సంబంధించిన సమాచారంపై కూడా విషం గక్కాడు. భారత్​ పై బురదజల్లె ప్రకటనలను కొనసాగించాడు. పైగా కశ్మీర్​ లోని పలువురు దేశ వ్యతిరేకులు ఉగ్రశిక్షణలో ఉంటే వారిపై రా అధికారులు నిఘా పెట్టగా, వారి సమాచారాన్ని కూడా దేశ వ్యతిరేక శక్తులతో పంచుకొని వారి కిడ్నాప్​ లో కూడా భాగస్వామ్యమయ్యాడు. బ్లిడ్జ్​, ది సండే గార్డియన్​ లాంటి ప్రముఖ పత్రికలు ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఈయనగారు భారత్​ కు చేసిన అన్యాయాలు, ఆకృత్యాలు, దేశ ద్రోహాన్ని కళ్లకు కట్టినట్లు ఆధారాలతో సహా ప్రచురించాయి. కాంగ్రెస్​ పార్టీలో ఉండి అనేక విదేశాంగ, మంత్రి పదవులు వెలగబెట్టిన అన్సారీకి చివరికి ఉపరాష్​ర్టపతి పదవిని కాంగ్రెస్​ అప్పజెప్పింది. అంతేగాక అనేక బాంబ్లస్ట్​ ల విషయాలు కూడా ఇతనికి ముందే తెలుసనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, హమీద్​ అన్సారీకి కరడుకట్టిన రౌడీషీటర్​, కాంగ్రెస్​ నేత ముఖ్తార్​ అన్సారీకి దగ్గరి బంధువు. ఈ విషయాన్ని కూడా స్వయంగా ఆ నాయకుడే కోర్టులో తెలపడం విశేషం. అంటే యూపీలో కూడా అలజడుల వెనుక ఈయన పాత్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తదుపరి యోగి సీఎం అయ్యాక ఈ అన్సారీ పనిపూర్తయ్యింది. జైలులోనే గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఇలా ఇతను భారత్​ లో వెలగబెట్టిన రాజకీయం నరనరాన భారత్​ దేశ విచ్ఛిన్నానికి, ద్రోహానికేననేది ఋజువవుతుంది.