ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్!
పాక్ చేతికి డ్రోన్లు, గగన్ యాన్ సమాచారం

లక్నో: యూపీ ఫిరోజాబాద్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన కీలక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐతో పంచుకుంటున్న ఐఎస్ ఐ ఏజెంట్ ను యూపీ ఏటీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డ్రోన్లు, గగన్ యాన్ లాంటి కీలక ప్రాజెక్టుల విషయాలను పాక్ ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించారు. రవీంద్ర కుమార్ ను ఆగ్రా నుంచి అరెస్టు చేశారు. నేహా శర్మ అనే మహిళ ట్రాప్ లో పడ్డ ఇతను డబ్బుకు ఆశపడి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని గత కొంతకాలంగా వాట్సాప్ ద్వారా ఆమెకు చేరవేస్తున్నాడు. దీన్ని పసిగట్టిన యూపీ ఏటీఎస్ నేహా శర్మ పేరుతో పాక్ ఐఎస్ఐ నకిలీ అకౌంట్ తో ఇతన్ని ట్రాప్ చేశారని గుర్తించింది. వలపన్ని రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? కీలక ప్రాజెక్టుల విషయం ఫోన్ లోకి ఎలా చేరింది. తదితర అంశాలపై ఏటీఎస్ అధికారులు రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.