1978 తీర్పుపై 7:1తో న్యాయమూర్తుల నిర్ణయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రతి ప్రైవేట్ ఆస్తిని ప్రజా ప్రయోజనాల పేరుతో కమ్యూనిటీ ఆస్తులుగా పేర్కొంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ముంబైకి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ (పీఓఏ) 1992లో దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో సహా 16 పిటిషన్లను ధర్మాసనం మంగళవారం విచారించింది.
తొమ్మిదిమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో 7:1 మెజార్టీతో తీర్పు వెలువరించింది. ప్రభుత్వం కొన్ని వనరులను మాత్రమే కమ్యూనిటీ వనరులుగా పరిగణించి, ప్రజా ప్రయోజనాల మేరకు ఉపయోగించవచ్చన్నారు. ఇదే అంశంపై 1978లో న్యాయమూర్తి కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. జస్టిస్ సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులో ప్రత్యేక ఆర్థిక, సామ్యవాద భావజాలం నుంచి ప్రేరణ పొందిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం ప్రతీఒక్క వనరులను స్వాధీనం చేసుకోలేరన్నారు. అదే సమయంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరైతే కోర్టులను ఆశ్రయించి ఆ తీర్పుల ద్వారా సేకరించవచ్చన్నారు.
సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేశ్ రాయ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేశ్ బిందాల్, ఎస్సీ శర్మ, అగస్టిన్ జార్జ్ మసీహ్ మెజారిటీ తీర్పును వెలువరించారు. జస్టిస్ బి.వి. మెజారిటీ నిర్ణయంపై నాగరత్న పాక్షికంగా విభేదించగా, జస్టిస్ సుధాన్షు ధులియా అన్ని అంశాలపైనా విభేదించారు.