బాలిక కిడ్నాప్​ నిందితుడిపై పోక్సో కేసు నమోదు

పోలీసుల సమయస్ఫూర్తితో కిడ్నాపైన చిన్నారి సురక్షితం నిందితుడు బిహార్​ వాసీ కొత్తూరు ఇన్ముల్​ నర్వలో పట్టివేత బాలికను కుటుంబీకులకు అప్పజెప్పిన పోలీసులు నిందితుడిపై బాధిత కుటుంబం, బంధువుల దాడికి యత్నం

Aug 4, 2024 - 13:19
 0
బాలిక కిడ్నాప్​ నిందితుడిపై పోక్సో కేసు నమోదు
నా తెలంగాణ, హైదరాబాద్‌: నగర నడిబొడ్డున చిన్నారి కిడ్నాప్​ కేసును పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కొలిక్కి తీసుకొచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి బాలికను సురక్షితంగా తీసుకురాగలిగారు. కిడ్నాప్​ చేసిన నిందితుడు బిహార్​ కు చెందిన బిలాల్​ ను ఆదివారం కొత్తూరు ఇన్ముల్​ నర్వలో పట్టుకున్నారు. బాలిక కూడా సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాలిక మరో చిన్నారి వెంట అబిడ్స్​ లోని కట్టెల మండిలో ఆడుకుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి ఆ చిన్నారికి చాక్లె ఇచ్చి ఆటోలో తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని కొత్తూరులోని ఇన్ముల్​ నర్వ నుంచి అదుపులోకి తీసుకున్నారు. బాలిక సురక్షితంగా ఉందని తీసుకువెళ్లాలన్న సమాచారాన్ని తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అబిడ్స్​ పోలీస్​ స్టేషన్​ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాలికను పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఇంతలోనే కొందరు నిందితుడు బిలాల్​ పై దాడికి పాల్పడ్డారు. పోలీసులు కలుగజేసుకొని అతన్ని స్టేషన్​ లోకి తీసుకువెళ్లి సెల్​ లో వేశారు. ఈ కిడ్నాప్​ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చంద్రశేఖర్​ తెలిపారు.