8వ ఇండియా వాటర్ వీక్–2024
ప్రారంభించనన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నాలుగు రోజుల సదస్సులో 40దేశాల ప్రతినిధులు హాజరు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 8వ ఇండియా వాటర్ వీక్ –2024ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ మంగళవారం న్యూ ఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం అధ్యక్ష కార్యాలయం నుంచి పత్రిక ప్రకటన తెలిపింది. ఈ వాటర్ వీక్ ను నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 40 దేశాల నుంచి నాలుగు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వందకుపైగా ఎగ్జిబిటర్లు, స్టార్టప్ ల ఎగ్జిబిషన్ ద్వారా నీటి రంగంలో తమ తమ ఆలోచనలను పంచుకోనున్నారు, ప్రదర్శించనున్నారు.
నీటివనరుల రంగంలో ప్రపంచస్థాయి నిర్ణయాధికారాలు, పరిశోధకులు, నిపుణులు, ఆవిష్కర్తలు, వాటాదారులు తదితరుల ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఓ చక్కని ప్రపంచవేదికగా మారగలదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భవిష్యత్ లో నీటి కొరత, సముద్రపు నీటిని తాగునీటిగా అత్యంత తక్కువ ఖర్చుతో మార్చడం వంటి పలు అంశాలపై చర్చలు నిర్వహించనున్నారు.