భారత్ లో 8 హెచ్ఎంపీవీ కేసులు నమోదు!
8 HMPV cases registered in India!

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ లోనూ హెచ్ ఎంపీవీ కేసులో రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం చేసిన పరీక్షల్లో మరో ఇద్దరికి పాజిటివ్ గా తేలింది. మహారాష్ర్టలోని నాగ్ పూర్ లో ఈ కేసులు నమోదయ్యాయి. 13యేళ్ల బాలిక, 7యేళ్ల బాలుడు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో వీరిద్దరిని క్వారైంటిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ లలో రెండు చొప్పున ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారంతా చిన్నారులే కావడం గమనార్హం. అయితే ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నిత్యం పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ఈ వైరస్ బారిన పడిన వారికి భయాందోళనలు అవసరం లేదన్నారు. ఈ వైరస్ సాధారణమైనదేనని అయినా జాగ్రత్తలు తప్పనిసరన్నారు. ఇప్పటికే నాలుగు రాష్ర్టాల్లో ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటికే ఈ దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారు ఎనిమిది మందిగా గుర్తించారు.