టిబెట్ లో భూకంపం 53 మంది మృతి, 62 మందికి గాయాలు
Earthquake in Tibet kills 53 and injures 62

7.1 తీవ్రత, నేపాల్, భూటాన్, సిక్కిం, ఉత్తరాఖండ్ లలోనూ ప్రభావం
టిబెట్: చైనా టిబెట్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్ర 7.1గా నమోదైంది. దీంతో 53 మంది మృతిచెందగా, 62 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. నేపాల్, భూటాన్, సిక్కిం, ఉత్తరాఖండ్ లలో కూడా దీని ప్రభావం భారీగా పడింది. అధికారిక సమాచారం ప్రకారం భూకంపం 9.05 గంటలకు సంభవించింది. టిబెట్ లోని షిజాంగ్ లో 10కి.మీ.లోతున భూకంపం కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. భారత్ లోనూ పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినా ఆ మేర తీవ్రత లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. భూకంపం వచ్చిన వెంటనే ఆయా దేశాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. సీసీ టీవీల్లో భూకంప కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. చైనా స్టేట్ కౌన్సిల్ భూకంప ప్రభావిత ప్రాంతానికి ప్రత్యేక అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని పంపించి వారి సూచన మేరకు ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ భూకంపం ప్రభావం భూకంప కేంద్రం నుంచి 400కి.మీ. వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గత ఐదేళ్లలో చైనా టిబెట్ లో నమోదైన భూకంపాల్లో ఇదే అత్యంత శక్తివంతమైనదిగా అధికారులు ప్రకటించారు. ఈ భూకంప కేంద్రం భారత్–యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న ప్రదేశంలో ఉన్నట్లుగా శాస్ర్తవేత్తలు తేల్చారు.