18వ లోక్​ సభలో  తొలిసారి అడుగిడనున్న 280మంది

280 people will be asking for the first time in the 18th Lok Sabha

Jun 7, 2024 - 19:35
 0
18వ లోక్​ సభలో  తొలిసారి అడుగిడనున్న 280మంది

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: 18వ లోక్​ సభకు ఎన్నికైన వారిలో 9మంది పార్టీలు మారగా, 8మంది పార్టీలను వీడి విజయం సాధించారు. పది ప్రముఖ పార్టీల నుంచే 479మంది లోక్​ సభకు ఎన్నికయ్యారు. 543 ఎంపీల్లో 536 మంది ఎంపీలు 41 పార్టీలకు చెందిన వారు కాగా, ఏడుగురు మాత్రమే స్వతంత్రులు ఎంపికయ్యారు. 31 పార్టీల నుంచి 57 మంది ఎంపీలు మాత్రమే గెలుపొందారు. కాగా వీరిలో తొలిసారిగా పార్లమెంట్​ లో 280 మంది అడుగిడటం విశేషం. లోక్​ సభకు రెండోసారి వెళుతున్న వారి సంఖ్య 116 కాగా, మూడోసారి 74 మంది, నాలుగోసారి 35 మంది, ఐదోసారి 19 మంది, ఆరోసారి 10మంది, ఏడోసారి ఏడుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే దేశంలోనే అత్యధికంగా ఎనిమిదిసార్లు విజయం సాధించిన ఎంపీ ఒకరున్నారు. మధ్యప్రదేశ్‌లోని టికామ్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ ఖటిక్ 2024లో కూడా విజయం సాధించి రికార్డు సాధించారు. పార్లమెంట్​ లో అత్యంత సీనియర్​ ఎంపీ స్థానంలో ఈయన రెండో వారీగా రికార్డు సృష్టించారు.

జాతీయ హోదా పార్టీలకు 346 స్థానాలు..

64 శాతం సీట్లను (346) జాతీయ హోదా కలిగిన పార్టీలు గెలుచుకోగా, 33 శాతం (179) సీట్లను రాష్ర్ట స్థాయి పార్టీలు గెలుచుకున్నాయి. గుర్తింపు పొందని పార్టీలు 11 సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీకి చెందిన 53 మంది మంత్రులు పోటీ చేయగా వారిలో 35 మంది విజయం సాధించగా 18 మంది ఓడిపోయారు. 

37 శాతం రైతు ఎంపీలు..

78 శాతం ఎంపీలు గ్రాడ్యుయేట్లు కాగా, ఐదుశాతం మంది డాక్టరేట్​ డిగ్రీలు పొందిన వారు కూడా ఉన్నారు. 48 శాతం ఎంపీలు సామాజిక కార్యకర్తలు కాగా, 37 శాతం మంది రైతులు, 32 శాతం వ్యాపారులు, ఏడుశాతం న్యాయనిపుణులు, నాలుగు శాతం వైద్యులు, కళాకారులు, ఉపాధ్యాయులు 3 శాతం, రెండు శాతం ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన వారు ఎంపీలుగా 18వ లోక్​ సభకు ఎన్నికవడం విశేషం. 

టాప్​ లో బీజేపీ 240 ఎంపీలు..

టాప్ 10 పార్టీలు బీజేపీ 240, కాంగ్రెస్ 99, సమాజ్ వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, ద్రవిడ మున్నేట్ర కజగం 22, తెలుగుదేశం పార్టీ 16, జనతాదళ్ యునైటెడ్ 12, శివసేన-యూబీటీ 9, ఎన్సీపీ-ఎస్పీ 8, ఏడుగురు శివసేన ఎంపీలున్నారు. ఈ పార్టీల సభ్యుల సంఖ్య 479. వీరిలో 204 మంది విపక్ష కూటమి భారత్‌కు చెందిన వారు కాగా, 275 మంది ఎన్డీయే సభ్యులు.

16 శాతం మహిళా ఎంపీలు..

ఈసారి ఎన్నికైన మహిళా ఎంపీల్లో 16 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉన్నారు. 30 సంవత్సరాలున్నవారు (41 శాతం) మంది లోక్‌సభకు మరోమారు ఎన్నికయ్యారు. 74 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా 2019లో 17వ లోక్‌సభలో ఈ సంఖ్య 78గా ఉంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి గత లోక్‌సభ చేసిన చట్టం ప్రకారం మహిళలకు 33 శాతం అంటే దాదాపు 180 సీట్లు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 14 శాతం సీట్లు మాత్రమే మహిళలకు దక్కాయి. రానున్న సమయంలో మహిళా రిజర్వేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.