కుంభమేళాలో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు

27 crore people take holy bath in Kumbh Mela

Jan 30, 2025 - 11:57
 0
కుంభమేళాలో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు

లక్నో: మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు గురువారం కూడా భారీ ఎత్తున కొనసాగుతున్న ఉదయం 11 గంటల వరకే 55 లక్షల మంది భక్తులు స్నానమాచరించారు. గురువారం (30 జనవరి) వరకు మొత్తం 27 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలాచరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా మేళాలో తొక్కిసలాట ఘటన తరువాత యూపీ ఈఎం యోగి ఆదిత్యనాథ్​ స్వయంగా రంగంలోకి దిగి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంగమం వద్దకు వచ్చే దారులన్నింటిలోనూ వాహనాల రాకపోకలను రద్దు చేశారు. మరోవైపు ప్రయాగ్​ రాజ్​ కు దారి తీసే ఎనిమిది దారుల్లోనూ ఇంకా భారీ ఎత్తున ట్రాఫిక్​ జామ్​ కొనసాగుతుంది. రైల్వే శాఖ భక్తులు వెళ్లేందుకు 162 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా రద్దీ కారణంగా రైళ్ల సమయాల్లో ఆలస్యం అవుతుంది. 

ప్రయాగ్‌రాజ్-–భదోహి–-వారణాసి సరిహద్దులో 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్‌రాజ్–-చిత్రకూట్ సరిహద్దులో 10 కిలోమీటర్లు, ప్రయాగ్‌రాజ్-–కౌశంబి సరిహద్దులో 50 వేల వాహనాలు, ప్రయాగ్‌రాజ్–-ప్రతాప్‌గఢ్ సరిహద్దులో 40 వేల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 

ఇంకోవైపు ఫిబ్రవరి 1న మహాకుంభ మేఆకు 50కి పగా దేశాల ఉపాధ్యక్షులు, రాయబారులు రానున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ పవిత్ర స్నానం ఆచరించనున్న నేపథ్యంలో సీఎం యోగి భద్రత చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.