మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మోదీ టార్గెట్ రెండే!
Modi's target for India as the third economy is two!
యుద్ధ పరిస్థితులే భారత్ కు అనుకూలం
ఊగిసలాడే విధానంలో ఇరుక్కుపోని మోదీ
రష్యాతో చమురు బంధం పటిష్ఠం
చైనాను నమ్మని ప్రపంచదేశాలు
భారత్ కు అవకాశాల గని
టాప్ 2 చర్యలను ప్రారంభించిన భారత్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అమెరికా–చైనా, రష్యా, రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–గాజా, లెబనాన్ ప్రపంచ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకొని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోని ఉగిసలాడే దేశాలకు ఇప్పటికే భారీ నష్టం తప్పడం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అనే నానుడిలా వ్యవహరించిన తప్పుకున్న దేశాల లిస్టులో భారత్ లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయా దేశాలకు సూటిగానే ఉగిసలాడే సమాధానాలు కాకుండా ప్రపంచశాంతి, వైశ్విక కుటుంబం లంటి సూత్రాలను బలంగానే నొక్కి చెప్పగలిగారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో భారత్ కు లాభాల పంట పండించగలుగుతున్నారు. అదే సమయంలో యుద్ధంలో నిరాశ్రయులైన వారికి పెద్ద దేశాలతో భయపడకుండా జంకకుండా ఇదే సూత్రం అండగా నేరుగా సహాయ సహాకారాలు అందిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకురాగలుగుతున్నారు.
చైనాపై కరోనా, బెలూన్లు, మైక్రోచిప్ ల అపవాదు..
ఇక విషయానికి వస్తే మోదీ ఆర్థిక విధానంతో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గ, విదేశీ అధికార బృందం పనితీరు చూస్తే ప్రపంచంలోనే భారత్ చైనాను వెనక్కు నెట్టే ప్రయత్నాలకు కూడా అంకుర్పాణలు జరిగాయి. ఫలితంగా చైనాను వెనక్కు నెట్టి రెండోస్థానంలోకి భారత్ ఎగబాకినా ఆశ్చర్యం లేదు. కరోనా, గ్యాస్ బెలూన్లు, మైక్రో చిప్ లతో సమాచారం లాంటి అపవాదులను మూటగట్టుకున్న చైనాపై అమెరికా ఇప్పటికే అనేకమార్లు కన్నెర్ర చేసింది. చైనా మైక్రోచిప్ లకు సంబంధించిన వంద పెద్ద సంస్థలను కూడా అమెరికా నుంచి తరిమికొట్టింది. దీంతో ఇటు అమెరికాకు కూడా నష్టమే అయినా ఈ చర్యతో భారత్ భారీగా బలపడనుంది.
మైక్రోచిప్ ల తయారీతోనే అంకురార్పణ..
ప్రపంచంలో మైక్రో చిప్ ల తయారీకి లభ్యమయ్యే గ్యాలియమ్, జెగ్నిషియమ్, యాటిమోలీ నే రసాయన పదార్థాలు అత్యధికంగా చైనాలోనే లభిస్తాయి. వీటిని అమెరికా–చైనా సంయుక్తంగా నిర్మిస్తున్న వంద సంస్థలకు ముడిసరుకు పంపేది. దీంతో ఆ సంస్థల్లో మైక్రోచిప్ లు భారీగా తయారయ్యేవి. మైక్రోచిప్ ల తయారీ సొంతంగా చైనా చేపట్టేయొచ్చు కదా? అనే అనుమానం కలుగుతుంది. కానీ చైనా వద్ద రసాయన పదార్థాలైతే ఉన్నాయి. అంతచిన్న మైక్రోచిప్ మెషినరీకి సంబంధించిన సాంకేతికత లేదు. దీంతో ఇరుదేశాలు కలిస్తేనే మైక్రో చిప్ ల రూపకల్పన సాధ్యపడుతుంది. దీంతో చైనా ఆర్థికంగా భారీగా నష్టపోక తప్పదు. ఇదే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంది.
దేశాల సహకారంతో ముందుడుగు..
చైనా సంస్థల తిరుగుప్రయాణంతో మైక్రోచిప్ ల తయారీకి గుజరాత్ ను కేంద్రంగా మార్చుకోవడంలో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఎదురైంది. పైన చెప్పిన రసాయన పదార్థాలు భారత్ లో లేవు. అయితే ఈ పదార్థాలకు ప్రత్యామ్నాయాలైన జమ్మూకశ్మీర్ లో లిథియం, అండమాన్ నికోబార్ లో ఇంధనం భారీ యెత్తున నిల్వలున్నాయి. కానీ భారత్ సాంకేతికత వీటిని వెలికితీసేందుకు పరిణితి సాధించలేదు. దీంతో అత్యంత జాగరూకతతో వ్యవహరించిన మోదీ ప్రభుత్వం రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, తైవాన్, జర్మనీ, జపాన్ లాంటి దేశాల సహకారంతో సంయుక్తంగా ముందుకు వెళ్లి వీటిని బయటికే ప్రణాళికలకు అంకురార్పణ చేశారు. ఇప్పటికే గుజరాత్ లో ప్రారంభమైన మైక్రోచిప్ సంస్థలు తైవాన్, జర్మనీ, జపాన్ ల నుంచి భారీ ఎత్తున ముడిసరుకును తెప్పించుకుంటుంది.
టాప్–పై భారత్ దృష్టి: ఐఎంఎఫ్ గీత గోపీనాథ్..
భారత్ ఆర్థికంగా ఎటువైపు వెళుతుందన్న విషయాన్ని ఇటీవలే ఓ అంతర్జాతీయ వేదికపై ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మోనిటరింగ్ ఫండ్– అంతర్జాతీయ ద్రవ్య పరపతి సంస్థ) డైరెక్టర్ గీత గోపినాథ్ (భారత్) ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక విధానం చెప్పుకునేందుకు మూడో నెంబర్ కు చేరుతుందనుకున్నా, రెండో నంబర్ సాధించే చర్యలు ఈ విధానంలో మిళితమై ఉన్నాయని స్పష్టం చేశారు. మోదీ దూరదృష్టితో ఇది సాధ్యమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆర్థికంలో ప్రపంచంలో మూడో విధానంలో నిలవకముందే రెండో విధానానికి కూడా అంకురార్పణ జరిగిందని ఐఎంఎఫ్ భావిస్తుందని ఆమె పేర్కొనడం గమనార్హం. చెప్పుకునేందుకు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన సమయంలోనే రెండో ఆర్థిక వ్యవస్థ విధానానికి కూడా చేరువవుతామని టాప్–2లో నిలుస్తామన్న ఆశాభావాన్ని గీత గోపినాథ్ చెప్పారు.