జేఈఈ మేయిన్స్​ లో తెలుగు విద్యార్థులు హవా

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

Feb 13, 2024 - 16:22
 0
జేఈఈ మేయిన్స్​ లో తెలుగు విద్యార్థులు హవా

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.  పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100శాతం స్కోరు సాధించారు. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే. తెలంగాణకు చెందిన రిషి శేఖర్‌ శుక్లా, పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, హుందేకర్‌ విదిత్‌, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌, తవ్వ దినేశ్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి వెంకట తనీశ్‌ రెడ్డి 100 పర్సంటైల్‌  స్కోరు సాధించారు.