పాక్​ కు పారిపోయిన 8మంది ఉగ్రవాదులు

లొంగిపోకుంటే ఆస్తులు జప్తు పోలీసుల హెచ్చరికలు

Jun 13, 2024 - 19:34
 0
పాక్​ కు పారిపోయిన 8మంది ఉగ్రవాదులు

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో భద్రతా దళాల సెర్చ్​ ఆపరేషన్​ లో కొంతమంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి రిమాండ్​ విధించింది. కాగా మరో 8 మంది పాక్​ కు పారిపోయినట్లు భద్రతా దళాల తరఫున పూర్తి వివరాలను కోర్టుకు అందజేశారు. వీరంతా పరారీలో ఉన్నట్లు కోర్టు నోటీసులు జారీ చేసింది. వీరంతా ఒక నెలరోజులలోపు లొంగిపోకుంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఎనిమిది మందికి చెందిన ఫోటోలను విడుదల చేశారు. వీరంతా కుప్వారా, ఉరీ సెక్టార్​ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారు.