ప్రజలు మోసపోరు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్​

ప్రజావ్యతిరేకమైన పాలన కాంగ్రెస్​ది అవినీతి పరులంతా సుద్ధపూసలయ్యారా? ఆరుగ్యారెంటీల ఊసే లేదు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ వైపే ప్రజలు

Mar 31, 2024 - 20:59
 0
ప్రజలు మోసపోరు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్​

నా తెలంగాణ, హైదరాబాద్: హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్​ లక్ష్మణ్​ అన్నారు. ఆదివారం లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్​ అవలంభిస్తున్న తీరు ప్రజావ్యతిరేకమైదని తెలిపారు. గతంలో బీఆర్​ఎస్​ అవలంభించిన విధానాలనే ఆయన అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన వారంతా అప్పుడు అవినీతి పరులుగా ఉన్నవారని, నేడు వారంతా సుద్ధపూసలయ్యారా? అని సీఎం రేవంత్​ను ప్రశ్నించారు. హస్తంలో చేరుతున్న ముఖ్యనేతలంతా కేసీఆర్​కు సన్నిహితులేనని తెలిపారు. వీరంతా కాంగ్రెస్​లో చేరడం వెనుక అనేక అపోహలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్​ పార్టీ గద్దెనెక్కి వందరోజులు గడిచిపోయినా ఆరు గ్యారెంటీల ఊసే లేదని ప్రజలు మోసపోయామని గ్రహించారని లక్ష్మణ్​ తెలిపారు. మరోసారి ప్రజలను మోసం చేసి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ లబ్ధి పొందాలని చూస్తోందని, అందుకు ప్రజలు మరోసారి హస్తాన్ని నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్త చూపు ప్రధాని నరేంద్ర మోదీ లాంటి స్వచ్ఛమైన నాయకుడు, బీజేపీ పార్టీపై ఉందని డాక్టర్​ లక్ష్మణ్​ అన్నారు.