భారత్​ రైస్​

అధిక బియ్యం ధరల నుంచి నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం

Feb 6, 2024 - 19:51
 0
భారత్​ రైస్​

నా తెలంగాణ, హైదరాబాద్​: అధిక బియ్యం ధరల నుంచి నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ‘భారత్​ రైస్​’ పేరుతో బ్రాండెడ్​ బియ్యం రూ. 29 కే కిలో చొప్పున అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి ఎక్స్​ లో పేర్కొన్నారు. భారత్​ రైస్​ విక్రయాల ప్రారంభం సందర్భంగా సబ్సిడీ బియ్యానికి సంబంధించిన పలు యాడ్​ లను పోస్ట్​ చేశారు. తొలిదశలో ఈ బియ్యాన్ని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్​ సమాఖ్య (నాఫెడ్​), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్​సీసీఎఫ్​), కేంద్రీయ భండార్​ విక్రయ కేంద్రాల ద్వారా, ఈ కామర్స్​ సైట్ల ద్వారా విక్రయించనున్నారు. బియ్యం బస్తాలు 5, 10 కేజీల ప్యాక్​ లలో లభించనున్నాయి. 
కొనుక్కోవచ్చు.