బడ్జెట్ సమావేశాలు పొడిగింపు?
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మరొక రోజు అదనంగా పొడిగించే అవకాశం ఉంది.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మరొక రోజు అదనంగా పొడిగించే అవకాశం ఉంది. పొడిగింపునకు కారణం ఏమిటనేది తెలియలేదు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన 10 రోజుల బడ్జెట్ సమావేశాలు ఈ నెల 9వ తేదీతో ముగియనున్నాయి. అయితే, వచ్చే శనివారం (10వ తేదీ) వరకూ సమావేశాలను పొడిగించే విషయంపై చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా, జమ్మూకశ్మీర్లోని స్థానిక సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్సభ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. 2019లో 370వ అధికరణను రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంలో కీలక మార్పులు చేపట్టినట్టు ప్రభుత్వం తెలియజేసింది. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టం బిల్లు-2024పై చర్చకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు కేంద్రపాలిత ప్రాంత ప్రజలు చవిచూస్తున్నారని చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్లోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు.