నీలోఫర్​ లో అగ్నిప్రమాదం అగ్నిమాపక శాఖ అప్రమత్తతో తప్పిన ముప్పు

ప్రముఖ చిన్న పిల్లల ప్రభుత్వాసుపత్రి నీలోఫర్​ లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Feb 7, 2024 - 20:02
 0
నీలోఫర్​ లో అగ్నిప్రమాదం అగ్నిమాపక శాఖ అప్రమత్తతో తప్పిన ముప్పు

నా తెలంగాణ, హైదరాబాద్​: ప్రముఖ చిన్న పిల్లల ప్రభుత్వాసుపత్రి నీలోఫర్​ లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని సిబ్బంది రోగులు ప్రాణాలరచేతిలో పెట్టుకొని బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రక్త, మూత్ర పరీక్షల నివేదికలు అందించే ల్యాబ్​ లో మంటలు చెలరేగినట్లుగా అధికారులు వెల్లడించారు. వైర్లు కాలిపోవడం వల్ల భారీగా పొగలు అలముకున్నాయని ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించలేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. అగ్నిప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.