యూసీసీకి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
అత్యంత ప్రతిష్టాత్మకమైన యూసీసీ (ఉమ్మడి పౌరస్మృతి) బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ మేరకు బిల్లును బుధవారం ఆమోదముద్ర వేసింది.
డెహ్రాడూన్: అత్యంత ప్రతిష్టాత్మకమైన యూసీసీ (ఉమ్మడి పౌరస్మృతి) బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ మేరకు బిల్లును బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇక రాష్ర్టపతి ఆమోదముద్ర వేయడమే తరువాతి అంకంగా సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం సందర్భంగా ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. ఇక నుంచి ఆ రాష్ర్టంలోని ప్రజలందరికీ ఒకే తరహా చట్టాలు వర్తించనున్నాయి. సహజీవనం, పుట్టిన పిల్లలు, వివాహా, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ తదితరాలకు ఒకే తరహా చట్టం అమలు కానుంది. ఈ బిల్లులో షెడ్యూల్డ్ తెగలను పరిధి నుంచి తప్పించారు. ఫిబ్రవరి నెల తొలిరోజు నుంచే యూసీసీ బిల్లుపై సీఎం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని నాయకులంతా ముక్తకంఠంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు పటాపంచలైనట్లయ్యాయి.