–40 ఎల్​ వోసీలో విధులు

– 40 Duties in LOC

Jan 1, 2025 - 17:18
 0
–40 ఎల్​ వోసీలో విధులు

అడుగడుగునా ప్రతికూలతలున్నా తగ్గేదేలే!
జవాన్లపై ఆర్మీ లెఫ్ట్​ నెంట్​ కల్నర్​ జనరల్​ సుచీంద్ర ప్రశంసలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఎముకలు కొరికే చలిలోనూ జమ్మూకశ్మీర్​ లో భారీ హిమపాతం కురుస్తుండగా –40 డిగ్రీల చలిలో భారత జవాన్లు పహారా కాస్తున్నారు. 20 వేల నుంచి 30వేల అడుగుల పైన సరిహద్దులో నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు. కాశ్మీర్​ నియంత్రణ రేఖ వెంట 57 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. పహారాకు కూడా పూర్తి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా జవాన్లు ఆ చలిలోనే ఎల్​ వోసీ వద్ద విధులు నిర్వహిస్తుండడం వార్తా మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఔరా అనిపిస్తుంది. విధి నిర్వహణ పట్ల సైనికుల నిబద్ధతపై సలాం కొడుతున్నారు. సరిహద్దు ఆవలివైపు నుంచి ఉగ్రవాదులు చొరబడి ల్యాండ్​ మైన్లు లాంటి పేలుడు పదార్థాలు అమర్చే అవకాశం ఉండడంతో మరింత ముమ్మరంగా విధుల నిర్వహణలో దేశ జవాన్లు నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఆర్మీ నార్తర్న్​ కమాండర్​ లెఫ్ట్​ నెంట్​ జనరల్​ ఎంవీ సుచీంద్ర కుమార్​ కాశ్మీర్​ లో పర్యటించి జవాన్లు నిర్వహిస్తున్న విధులపై సంతృప్తి, హర్షం వ్యక్తం చేశారు. సరిహద్దు కాపాలను పటిష్ఠంగా కొనసాగిస్తున్న జవాన్లను అభినందనల్లో ముంచెత్తారు. అదే సమయంలో వారి ఆరోగ్య కార్యకలాపాలు, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నందున ప్రతీ ఒక్క సైనికుని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.