త్రిశూలధారి
జ్ఞానవాపి సందర్శన.. మోదీకి జయజయ ధ్వనాలు చేసిన ముస్లింలు
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిశూలధారిగా మారారు. వారణాసిలో కాశీ విశ్వనాథుని ప్రత్యేక పూజల అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహూకరించిన త్రిశూలంతో మోదీ అభివాదం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వారణాసికి చేరుకున్నారు. యూపీలో రెండు రోజులపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. త్రిశూలం చేతబూని ప్రధాని మందిరం బయటికి రావడంతో భక్తులు హరహరమహాదేవ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కోర్టు కేసులో ఉన్న జ్ఞానవాపీని ప్రధాని సందర్శించారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదు లోపల ఉన్నారు. వారంతా కూడా ప్రధానికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జయ జయ ధ్వానాలు చేయడం విశేషం.