ఆర్మీ చీఫ్ కార్యాలయంలో కర్మక్షేత్రం చిత్రం
Work field picture at Army Chief's office
పాక్ సైనికులు లొంగిపోయిన చిత్రం తొలగింపు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ ఆర్మీచీఫ్ కార్యాలయం నుంచి 1971 నాటి యుద్ధం అనంతరం పాక్ భారత అధికారుల ముందు లొంగిపోతున్న చిత్రాన్ని తొలగించారు. సోమవారం ఈ విషయం వెల్లడైంది. ఈ చిత్రం స్థానంలో ‘కర్మక్షేత్ర’ అనే చిత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయాన్ని సైన్యం అధికారికంగా ప్రకటించలేదు. కర్మక్షేత్రం చిత్రాన్ని 28వ మద్రాస్ రెజిమెంట్ కు చెందిన లెఫ్ట్ నెంట్ కల్నల్ థామస్ జాకబ్ రూపొందించారు. ఈ చిత్రం ఇప్పుడు న్యూ ఢిల్లీలోని రైసినా హిల్స్ లోని సౌత్ బ్లాక్ ఆర్మీ చీఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కర్మక్షేత్ర చిత్రంలో లడఖ్‌లోని భారతదేశం–-చైనా సరిహద్దులోని పాంగోంగ్ సరస్సు కుడి వైపున ఉంది. ఎడమ వైపున గరుడుడు, మహాభారత రథంపై అర్జునుడు, అతని రథసారధి శ్రీకృష్ణుడు ఉన్నారు. చిత్రంలో మంచుతో కప్పబడిన పర్వతాలున్నాయి. మధ్యలో మౌర్యుల కాలం నాటి వ్యూహకర్త చాణక్యుడు ఉన్నాడు. అంతే కాకుండా సైన్యంలో ఉపయోగించే ఆయుధాలు, ట్రక్కులు, ట్యాంకులు, వాహనాలు, పడవలు, హెలికాప్టర్లు వంటి అత్యాధునిక అంశాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రానికి ‘ఫీల్డ్ ఆఫ్ డీడ్స్ అని పేరు పెట్టారు.