అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తారా?

దేశానికి విఘాతం కలిగించే పార్టీలు కాంగ్రెస్​, కూటమిలని ప్రజలకు అర్థమైంది సోరాన్​ సభలో కేంద్ర మంత్రి అమిత్​ షా

May 19, 2024 - 15:36
 0
అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తారా?

లక్నో: దేశంలోని అణ్వాయుధాలను కాంగ్రెస్​, కూటమిపక్షాలు నిర్వీర్యం చేయాలని అనుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఆరోపించారు. ఈ పార్టీలు దేశానికి విఘాతం కలిగించేవన్నారు. ఈ పార్టీల తీరు పూర్తిగా దేశ ప్రజలకు అర్థమైందని షా తెలిపారు. ముందుగా ప్రయాగ్‌రాజ్ పవిత్ర భూమికి నివాళులర్పించారు. అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్, లాల్ పద్మధర్, జాతి నిర్మాత మహామాన పండిట్ మదన్ మోహన్ మాలవ్యలను కూడా స్మరించుకున్నారు. మహాకవి నిరాలా, సుమిత్రానందన్ పంత్, మహాదేవి వర్మ, హరివంశ్ రాయ్ బచ్చన్ వంటి అమర సాహితీవేత్తలను కూడా ఆయన అమిత్​ షా స్మరించుకున్నారు.

యూపీలో ప్రయాగ్​ రాజ్​ సోరాన్​ లో ఎన్నికల ప్రచార సభలో ఆదివారం కేంద్రమంత్రి అమిత్​ షా మాట్లాడారు. 

ఓ వైపు తాము భారత్​ ను పూర్తి సురక్షితంగా ఉంచాలని భావిస్తుంటే మరోవైపు ఈ పార్టీలు పాక్​ కు వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్​ తరాలకు పునాది వేసే పనిలో తామున్నామని షా అన్నారు. ఈ పార్టీలేమో పునాదులను పెకిలించేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. వీరి ఆలోచనా రీతి దేశానికి సురక్షితమైనది కాదని స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి మోదీ హ్యాట్రిక్​ ఖాయమని అమిత్​ షా పేర్కొన్నారు. 

దేశంలోని ప్రజలు ప్రతీయేటా ఒక ప్రధానిని వద్దనుకుంటున్నారని దేశాన్ని సురక్షితంగ ఉంచే మోదీయే మరోమారు ప్రధానిగా ఎన్నుకుంటారని షా తెలిపారు.

వారు చేయలేని పనిని కేవలం ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. రామాలయాన్ని నిర్మించామన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠను కూడా వ్యతిరేకించే పార్టీలు దేశాన్ని హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను ఏం కాపాడతాయని ప్రశ్నించారు.  

పండిత్​ కేసరినాథ్​ కృషి ఎనలేనిదన్నారు. అందుకే ఆయన కుమారుడు నీరజ్​ త్రిపాఠీకే ఓటు వేసి గెలిపించాలని అమిత్​ షా విజ్ఞప్తి చేశారు. మోదీ హయాంలో ఉచిత రేషన్, పేదరిక నిర్మూలన, రోడ్లు, వంతెనలు, గృహాలు, మరుగుదొడ్లు నెట్‌వర్క్ వంటి మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా అమిత్ షా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన, శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుంటుందని షా స్పష్టం చేశారు.