ఇక టిక్‌టాక్ మస్క్ దే?! త్వరలో జరగనున్న డీల్ కు రంగం సిద్ధం
What about Tiktok Musk?! Prepare the ground for the soon deal
వాషింగ్టన్ డీసీ: టిక్‌టాక్ ను సొంతం చేసుకోవాలని ఎలన్ మస్క్ ఆరాటపడుతున్నారు. ఈ చైనా కంపెనీపై పలు ఆరోపణల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు టిక్ టాక్ ను బ్యాన్ చేశాయి. భారత్ కూడా దీనిపై బ్యాన్ విధించింది. అమెరికాలోనూ జో బైడెన్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఇందుకు అమెరికా సుప్రీంకోర్టు కూడా సై చెప్పింది. కాగా ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికన్ చట్టాల ప్రకారం ఈ సంస్థలోని 50 శాతం వాటా స్థానికులదైతే దానిపై బ్యాన్ ఎత్తేయనున్నారు. నిషేధం విధించకముందు ఈ సంస్థ అమెరికా మార్కెట్ వాల్యూ 200 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం దాని ధర కేవలం 40 బిలియన్ డాలర్లే. ఈ నేపథ్యంలో తన ఆప్తమిత్రుడు ట్రంప్ అధికారంలోకి రావడంతో ఎలన్ మస్క్ టిక్ టాక్ ను కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దీంతో అత్యంత తక్కువ ధరలోనే ఈ సంస్థలోని 50 శాతం వాటాను దక్కించుకునే అవకాశం ఉంది. టిక్ టాక్ కు అమెరికాలో 17 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ ఆర్థికంగా మరింత పరిపుష్ఠికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 75 రోజుల్లోగా వాటాల విక్రయం చైనా సంస్థ తీసుకుంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేళ తీసుకోకుంటే టిక్ టాక్ పై నిషేధం అలానే కొనసాగి దాని ధర మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉంది. అదే సమయంలో టిక్ టాక్ లో 50 శాతం వాటాను దక్కించుకున్నాక మస్క్ ఈ సంస్థను భారత్ లోనూ ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉండడం విశేషం.