పావనమైన రూప దర్శనంతో పునీతులు కావాలి

ఎన్నో త్యాగాల ఫలితమే బాలరాముని ఆలయ నిర్మాణం వివాదంగా మార్చిందే కాంగ్రెస్​ 60 ఏళ్లలో చేయలేనిది పదేళ్లలో చేసి చూపించాం మొదటి విడతలో బీజేపీని ఆశీర్వదించాలి అసోం ఎన్నికల సభలో ప్రధాని మోదీ

Apr 17, 2024 - 13:37
 0
పావనమైన రూప దర్శనంతో పునీతులు కావాలి

డిస్ఫూర్​: 500 ఏళ్ల తరువాత దేశ ప్రజలకు తొలిసారిగా బాలరాముడి సూర్య తిలకంతో దర్శనమిస్తున్నాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పావనమైన బాలరాముడి రూపాన్ని తిలకించి భక్తులు పునీతులు కావాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలను తెలిపారు. బుధవారం అసోంలోని నల్సారీలో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ఆలయ నిర్మాణం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. అసలు దీన్ని వివాదంగా మార్చిందే కాంగ్రెస్​ ప్రభుత్వమని మండిపడ్డారు. భారతదేశం సర్వమత సమ్మేళనమన్న విషయాన్ని వారు మరిచి హిందుమత నాశనాన్నే కాంగ్రెస్​ కోరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాలరాముడి దర్శనానికి స్వయంగా దివి నుంచి భువికి సూర్యభగవానుడి దిగివచ్చాడని అన్నారు. 
మొదటి విడతలో జరగనున్న ఫలితాలు ఒకే వైపు విజయానికి సూచీక అన్నారు. మోదీ గ్యారంటీతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కూడా తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. గత ప్రభుత్వాలు వేర్పాటువాదం, ఉగ్రవాదం, నక్సలిజం లాంటి హింసాయుత వాతావరణాన్ని సృష్టించాయన్నారు. కానీ తాము వచ్చాక అలాంటి వాటిని దేశం నుంచి తరిమికొట్టామన్నారు. గత పదేళ్లలో శాంతియుత, అభివృద్ధికే అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. అదే సమయంలో నిరుపేదలు, దేశ ప్రజల కోసం  మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో కూడా మోదీ హ్యాట్రిక్​ సాధించాక దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ గత 60 ఏళ్లలో చేయలేనిది తాము పదేళ్లలో సాధించి చూపెట్టామన్నారు.

మొదటి విడతలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అసోం ప్రజలు ఆశీర్వదించాలని అభివృద్ధికి నాందీ పలకాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.