పుణ్య స్నానాల వీడియోలు, చిత్రాలు డార్క్​ వెబ్​ లోకి!

Videos and pictures of Punya Sanna on the dark web!

Feb 21, 2025 - 14:10
 0
పుణ్య స్నానాల వీడియోలు, చిత్రాలు డార్క్​ వెబ్​ లోకి!

13 ఎఫ్​ ఐఆర్​ లు నమోదు, 103 ఖాతాలు రద్దు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

లక్నో: మహాకుంభమేళాలో పుణ్య స్నానమాచరిస్తున్న మహిళల చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న, డార్క్​ వెబ్​ ద్వారా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం మహారాష్ర్ట, రాజస్థాన్​, ప్రయాగ్​ రాజ్​ లలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 103 సోషల్​ ఖాతాలను రద్దు చేశారు. 17 ఖాతాల ద్వారా డార్క్​ వెబ్​ లో ఈ చిత్రాలను అమ్ముకుంటున్నట్లు గుర్తించి ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరింతమంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 13 ఎఫ్​ ఐఆర్​ లను నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్​ స్టాగ్రామ్​, ఫేస్​ బుక్​, టెలిగ్రామ్​, పలు డార్క్​ వెబ్​ సైట్​ లలో కూడా చిత్రాలు అప్​ లోడ్​ చేసినట్లు గుర్తించారు. మహారాష్ర్ట, గుజరాత్​ నుంచి అదుపులోకి తీసుకున్న ఇద్దరి ఖాతాలను పరిశీలించగా నాలుగు చిత్రాలకు రూ. 2వేలు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ రకమైన నీచమైన ఆకృత్యానికి పాల్పడిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.