పరిపాలనలో కీలక మార్పులు

Key changes in administration

Feb 21, 2025 - 13:53
 0
పరిపాలనలో కీలక మార్పులు

మాతృవిభాగాల్లోకి అధికారులు
మహిళల ప్రయాణానికి గ్రీన్​ సిగ్నల్​
మాజీ సీఎం, మంత్రుల వ్యక్తిగత సిబ్బంది సేవలు రద్దు
డిటీసీ బస్సులు, కాంట్రాక్టులపై ఆరా
ఆయుష్మాన్​ భవ అమలుకు అడ్డంకులేంటీ?
ఆప్​, అధికారుల్లో మొదలైన గుబులు
సీఎం రేఖా గుప్తా రెండో రోజు కీలక నిర్ణయాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా పరిపాలనలో కీలకమైన మార్పులను చేశారు. శుక్రవారం ఉదయం సచివాలయానికి విచ్చేసిన ఆమె మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆప్​ హాయంలో ఏర్పాటు చేసిన కీలక పదవుల్లోని నాయకుల పరిపాలనలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే గాకుండా ఉచిత క్లినిక్​ లలో అవకతవకలపై తనిఖీలు, మహిళలకు ఉచిత ప్రయానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. వెంటనే అధికారులు, ఉద్యోగులు వారి వారి మాతృ విభాగాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మాజీ సీఎం, మంత్రుల వ్యక్తిగత సిబ్బంది సేవలను పూర్తిగా రద్దు చేశారు. డిటీసీ బస్సులపై వస్తున్న ఆరోపణలపై కూడా ఆరా తీశారు. బస్సులు కొనకుండానే కొన్నట్లు ఆప్​ ప్రభుత్వం చూపినట్లు గుర్తించారు. పూర్తి సమాచారం అనంతరం ఉన్నతస్థాయి దర్యాప్తునకు సీఎం ఆదేశించనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి గత ప్రభుత్వ కాంట్రాక్టులపై కూడా సీఎం సమాచారం కోరారు. అలాగే ఆయుష్మాన్​ భవ అమలుపై కూడా సీఎం రేఖా గుప్తా ఆరా తీసినట్లు తెలుస్తుంది. గుప్తా దూకుడుపై ఆప్​ పార్టీ నేతల్లో, అధికారుల్లో గుబులు మొదలైంది.