సిన్వార్​ మృతి? అజ్ఞాతమా?

బందీల విడుదలకు ఆటంకాలు యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం అక్టోబర్​ 7 ఇజ్రాయెల్​ దాడిలో కీలక సూత్రధారి

Oct 6, 2024 - 19:57
 0
సిన్వార్​ మృతి? అజ్ఞాతమా?

జెరూసలెం: హమాస్​ చీఫ్​ యహ్వా సిన్వార్​ మృతిచెందినట్లుగా ఇజ్రాయెల్​ భావిస్తోంది. గత వారం పదిరోజులుగా అతని ఆచూకీ లభించడం లేదనే ఆందోళన ఇజ్రాయెల్​ ను వెంటాడుతోంది. ఇజ్రాయెల్​ బందీలు ఇతని చెరలోనే ఉండడంతో సిన్వార్​ జాడను పలుమార్లు గుర్తించినా అతనిపై ఇజ్రాయెల్​ దాడి చేయలేదు. ఇజ్రాయెల్​ బందీల విడుదలకు ఖతార్​ కూడా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అతను ప్రస్తుతం సంప్రదింపుల్లోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సిన్వార్​ జాడ తెలియకుంటే యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం లేకపోలేదు. వరుసగా ఇజ్రాయెల్​ హమాస్​, హిజ్బుల్లా అగ్రనేతలను టార్గెట్​ చేస్తుండడంతో సిన్వార్​ అండర్​ గ్రౌండ్​ లోకి వెళ్లాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్​ పై అక్టోబర్​ 7 దాడులకు కీలకసూత్రధారుల్లో సిన్వార్​ కూడా ఒకరు.