Kishan Reddy: మోదీ నాయకత్వాన్ని బలపరచండి

Union Minister Kishan Reddy asked people to strengthen BJP in Telangana

Mar 15, 2024 - 15:45
 0
Kishan Reddy: మోదీ నాయకత్వాన్ని బలపరచండి
  • తెలంగాణలో17 సీట్లు గెలవడమే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం

  •  హైదరాబాద్ లో ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం

  •  వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి

  •  దేశం కోసం, ధర్మకోసం బీజేపీకి ఓటు వేయండి

  •  అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కిషన్​ రెడ్డి కామెంట్స్​

నా తెలంగాణ, హైదరాబాద్​: మరోసారి ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి కోరారు. తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈసారి బీజేపీకి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించబోతున్నది. హైదరాబాద్​ లో మజ్లిస్​ పార్టీ, ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం. వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి. ప్రజలు ఆలోచించి స్పందించాలి. పార్లమెంటు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. దేశం కోసం, ధర్మకోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ గౌరవాన్ని పెంచడం కోసం గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వచ్చే ఐదు సంవత్సరాలు మరింత అంకితభావం, సేవాభావంతో పని చేస్తాం. దేశ ప్రజలు కూడా నరేంద్రమోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. 

400 సీట్లు..

ఎన్టీయే కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు మరో 5 సంవత్సరాలు సంక్షేమం అందించాలని ఆలోచన చేస్తున్నాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత 4 సెక్టార్ల ద్వారా దేశంలో పని చేయబోతున్నాం. మహిళలు, యువకులు, రైతులు, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాం. బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించండి”అని ఆయన కోరారు.



అభివృద్ధి పనులకు శ్రీకారం..

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సనత్ నగర్ డివిజన్, మైసమ్మ టెంపుల్ లో పవర్ బోర్ ప్రారంభించారు. అమీర్​ పేట్ డివిజన్, బాపూ నగర్ లో ఆర్వోర్​ ప్లాంట్ ను షురూ చేశారు. ఎస్​ఆర్​ నగర్ వాటర్ ట్యాంక్ పార్క్ లో, దివ్య శక్తి అపార్ట్​ మెంట్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. బేగంపేట్ డివిజన్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఓపెన్ జిమ్ ను ఓపెన్​ చేశారు. మొండా మార్కెట్​ డివిజన్, గ్యాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో ఓపెన్ జిమ్, బన్సీలాల్ పేట డివిజన్, న్యూ బోయిగూడ, జీహెచ్​ఎఎంసీ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అడ్డగుట్ట డివిజన్, సాయి నగర్ లో పవర్ బోర్, కొండారెడ్డి కాలనీ పార్క్ లో ఓపెన్ జిమ్, తార్నాక డివిజన్, లాలాపేట్, వినోభా నగర్ లలో కమ్యూనిటీ హాల్, పవర్​ బోర్​ ను ప్రారంభించారు. తార్నాక డివిజన్, నాన్ టీచింగ్ హోమ్ ఓయూ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.