పాపం రాష్ట్రపతి ముర్మూ సోనియాగాంధీ అనుచిత వ్యాఖ్యలు
Unfortunately President Murmu Sonia Gandhi's inappropriate comments
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పాపం దేశ అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్మూ అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పార్లమెంట్ లో సమావేశం అనంతరం బయట సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాసిన స్ర్కిప్టును రాష్ట్రపతి ముర్మూ చదివారని పాపం అధ్యక్షురాలని సంబోధించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతుంది. దేశ గిరిజన మహిళ రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని ఇదే వారి అసలైన మనస్తత్వమని మండిపడ్డారు.