వృద్ధిపై దృష్టి సారించాలి

ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్​

Jan 31, 2025 - 17:44
 0
వృద్ధిపై దృష్టి సారించాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచదేశాల్లోని ఆర్థిక రంగాలు మందగమనంలో ఉన్నాయని, భారత్​ దేశీయ వృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్​ అన్నారు. పార్లమెంట్​ లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం శుక్రవారం నాగేశ్వరన్​ మీడియాతో మాట్లాడి తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2014–15లో వాణిజ్య విలువ 170 బిలియన్​ డాలర్లు కాగా ప్రస్తుతం 1.3 ట్రిలియన్​ డాలర్లకు చేరుకుందన్నారు. దిగుమతులు, ఎగుమతుల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం గ్లోబల్​ ట్రేడ్​ డైనమిక్స్​ లో చర్యల ఫలితమేనన్నారు. ఈ మార్పు ఎంతోకాలంగా కొనసాగుతుందని, వృద్ధి కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం భారత్​ స్థిరమైన వృద్ధిబాటలో పయనిస్తుందని, అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్నారని నాగేశ్వరన్​ పేర్కొన్నారు. ఈ మార్పు భారత్​ కు నూతన సవాళ్లను సృష్టించనుందన్నారు. ఈ నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలోని యువశ్రామిక శక్తిని వినియోగించుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. 2047 వికసిత్​ భారత్​ ఆకాంక్షను సాకారం చేసుకోవాలంటే మరిన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగేశ్వరన్​ స్పష్టం చేశారు. 
.........