పార్లమెంట్ కు మంత్రి బడ్జెట్ సర్వే నివేదిక సమర్పణ
Submission of Minister's Budget Survey Report to Parliament
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8 శాతం వరకు 2025లో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం తొలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ర్టపతి ప్రసంగం అనంతరం ఆర్థిక శాఖ బడ్జెట్ సర్వేకు సంబంధించిన నివేదికను పార్లమెంట్ కు సమర్పించారు. అనంతరం పార్లమెంట్ లో ప్రసంగించారు. మంత్రి నివేదిక ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు మందగించే అవకాశం ఉంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం అదుపులోనే స్థిరంగా ఉంటుంది. నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు రూపొందించారు. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి దేశం అభివృద్ధి దిశగా రూపొంతరం చెందుతుందని ఆకాంక్షించారు. రానున్న రెండేళ్లలో 8 శాతం స్థిరమైన వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణం, ప్రపంచ రాజకీయ, ఆర్థిక వృద్ధి ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు.