రాష్ట్రపతిపై కాంగ్రెస్ వ్యాఖ్యలపై ప్రధాని మండిపాటు
Prime Minister's anger over Congress' comments on the President
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రపతిని పూర్ లేడీ అనడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. శుక్రవారం సోనియాగాంధీ రాష్ట్రపతి విమర్శలపై ప్రధాని కౌంటర్ అటాక్ ఇచ్చారు. నిరుపేద కుటుంబం నుంచి ఈ రోజు ఉన్నతస్థాయికి ఎదిగిన అధ్యక్షురాలు ముర్మూను అగౌరవ పర్చడం కాంగ్రెస్ కు తగదన్నారు. ఆమె మాతృభాష ఒరియా అయినా హిందిలో బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగాన్ని ఎంతో బాగా చదివి వినిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగంపై అలసిపోయారని అనడంపై కాంగ్రెస్ ధోరణిని వెల్లడిస్తుందన్నారు. రాష్ట్రపతిపై కాంగ్రెస్ లోని అధినేతలే గాక ఇతర నాయకులు కూడా చేసిన విమర్శలు వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పదికోట్ల మంది గిరిజనులకు ఇది అవమానమే అని ఆవేదన వ్యకతం చేశారు. అడుగడుగునా గిరిజనులను అవమానించడం, కించపర్చడం, నక్సల్స్ గురించి మాట్లాడుతూ అగౌరపర్చడం వీరికి పరిపాటిగా మారిందని ప్రధాని మోదీ మండిపడ్డారు.