బడ్జెట్​ పరిపుర్ణమెలా?

How is the budget fulfilled?

Jan 31, 2025 - 16:24
 0
బడ్జెట్​ పరిపుర్ణమెలా?

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: సాధారణ బడ్జెట్​ రూపొందించే ప్రక్రియలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, ఆర్థికవేత్తలు, పరిశ్రమల ప్రముఖుల నుంచి సలహాలను తీసుకుంటుంది. అనంతరం బడ్జెట్​ రూపకల్పనకు ఉపక్రమిస్తుంది. బడ్జెట్​ సమర్పణకు ముందే రాష్ర్టపతి, లోక్​ సభ స్పీకర్​ నుంచి అనుమతిని తీసుకుంటుంది. సమర్పణకు ముందే క్యాబినెట్​ కు సర్వేను సమర్పిస్తుంది. ఈ సర్వే బడ్జెట్​ కు పూర్తి స్వరూపం. అంశాల వారీగా బడ్జెట్​ సమర్పణకు ఒకరోజు ముందు మాత్రమే పార్లమెంట్​ స్పీకర్​ కు అందజేయబడుతుంది. అనంతరం రోజునే పార్లమెంట్​ లో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్​ ను సమర్పిస్తారు. బడ్జెట్​ రూపకల్పనపై రాజ్యాంగంలోని ఆర్టికల్​ 112 లో కూడా ప్రస్తావించారు. నెలరోజుల ముందే బడ్జెట్​ ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు క్లోడ్జ్​ రూమ్​ లో అధికారుల ప్రక్రియ ఆరంభం అవుతుంది. 

వారం ముందు హల్వా వేడుక..
బడ్జెట్​ రూపకల్పన పూర్తి అయ్యాక సమర్పణకు వారం రోజుల ముందు ఆర్థిక శాఖ మంత్రి హల్వా వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకలో స్వయంగా ఆర్థిక మంత్రి హల్వాను రూపొందించి బడ్జెట్​ రూపకల్పనలో పాల్గొన్న అధికారులకు వడ్డిస్తారు. ఈ సాంప్రదాయ హల్వా వేడుక ప్రసిద్ధి చెందింది. దీంతో బడ్జెట్​ సమర్పణ లెక్కలు పూర్తయ్యాయని అర్థం. అంతేగాక ఈ వేడుక తరువాత ఎలాంటి మార్పుచేర్పులను చేయరు. వేడుక అనంతరం బడ్జెట్​ పత్రాలను ప్రింటింగ్​ (ముద్రణ)కు పంపిస్తారు. బడ్జెట్​ లోని లెక్కలు అందరికీ తీపిని పంచేలా ఉండాలని ఆకాంక్షిస్తూ హల్వా వేడుకను నిర్వహిస్తారు. బడ్జెట్​ తయారీ, ముద్రణ కోసం వందమంది అధికారులు పార్లమెంట్​ లోని నార్త్​ బ్లాక్​ లోనే ఉంటారు. వీరంతా బడ్జెట్​ సమర్పణ తరువాత బయటకు వస్తారు. 

నీతి ఆయోగ్​ అధికారుల కీలకపాత్ర..
ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్​, ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలు బడ్జెట్​ తయారీ ప్రక్రియలో పాల్గొంటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఖర్చుల ఆధారంగా మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. దీని తర్వాత మంత్రిత్వ శాఖలు తమ తమ డిమాండ్లను తెలియజేస్తాయి. బడ్జెట్‌ను రూపొందించే బాధ్యత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్ విభాగం తీసుకుంటుంది. ఈ విభాగం నోడల్ ఏజెన్సీ. బడ్జెట్ విభాగం అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్త సంస్థలు, విభాగాలు, రక్షణ దళాలకు వచ్చే ఏడాది అంచనాలను తెలియజేయమని సర్క్యూలర్‌లను జారీ చేస్తుంది. మంత్రిత్వ శాఖలు, శాఖల నుంచి డిమాండ్లను స్వీకరిస్తుంది. అనంతరం ఆర్థికశాఖ, అధికారుల మధ్య చర్చలు జరుగుతాయి.

లండన్​ సాంప్రదాయానికి తెర..
2000 సంవత్సరం వరకు దేశ సాధారణ బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేసేవారు. భారత్​ లో విడుదల చేసిన బడ్జెట్​ ను లండన్​ లో ఉదయం 11.30 గంటలకు (సమయం తేడా కారణంగా) అక్కడి పార్లమెంట్​ సభ్యులు వినేవారు. అనంతరం ఈ సంప్రదాయానికి ముగింపు పలికారు. 2017కి ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా సమర్పించారు. 2017లో బడ్జెట్​ తేదీని ఫిబ్రవరి 1కి మార్చడంతోపాటు రైల్వే బడ్జెట్​ ను ప్రత్యేకంగా సమర్పించే సంప్రదాయానికి కేంద్రం స్వస్తి పలికింది. దీంతో 1924లో నుంచి రైల్వే బడ్జెట్​ విడుదల సంప్రదాయానికి ఫుల్​ స్టాప్​ పడింది.