1860లోనే తొలి భారత బడ్జెట్!
అధికారికంగా 1947 నవంబర్ 26న బడ్జెట్!

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: సిపాయిల తిరుగుబాటు 1857 తరువాత భారత్ దేశ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలుసా? అవును ఇది నిజ్జంగా నిజమే! ఈ బడ్జెట్ ను దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా వేల కిలోమీటర్ల దూరంలోని లండన్ బ్రిటిష్ క్రౌన్ ముందు సమర్పించారు. సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. దీంతో భారీ నష్టం కూడా చోటు చేసుకుంది. నష్టాలను భర్తీ చేసేందుకు భారత్ లోనే పలు రకాల పన్నుల ను రూపకల్పన చేశారు. ఇందుకోసం బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు. ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ ను ఈస్టిండియా సంస్థ అధికారి జేమ్స్ విల్సన్ బ్రిటిష్ క్రౌన్ కు 1860 ఏప్రిల్ 7న అందించారు. అప్పటి నుంచి చాలాకాలంపాటు ఇదే భారతదేశ తొలి బడ్జెట్ గా పరిగణించారు. 1947 స్వాతంత్ర్యం అనంతరం నవంబర్ 26న ఆర్ కె షణ్ముగం చెట్టి తొలిసారి బడ్జెట్ అధికారికంగా సమర్పించారు. కాగా 1860 బడ్జెటే తొలి బడ్జెట్ గా పేర్కొంటున్నట్లు ఇప్పటికీ పలు రకాల దీనికి సంబంధించిన ఆధారాలు పుస్తకాల్లో ఉన్నాయి. కాగా ఈ బడ్జెట్ లో విధించిన పన్నులను పలువరు ఖండించారు. 1886లో ప్రత్యేక ఆదాయపు పన్ను చట్టాన్ని ఆమోదించారు. కాగా సిపాయిల తిరుగుబాటు, వారిపై బ్రిటీష్ దౌర్జన్యాలను పలువురు తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ లోని ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకించారు.