న్యాయవ్యవస్థ దుర్వినియోగం

యూనస్​ పై షేక్​ హసీనా కుమారుడు మండిపాటు

Dec 26, 2024 - 14:07
 0
న్యాయవ్యవస్థ దుర్వినియోగం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్​ న్యాయవ్యవస్థ తాత్కాలిక యూనస్​ ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణంగా దుర్వినియోగం చేస్తుందని షేక్​ హసీనా కుమారుడు సాజిబ్​ వాజిద్​ ఆరోపించారు. గురువారం ఆయన సామాజిక మాధ్యమం వేదికగా యూనస్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం షేక్​ హసీనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు.  న్యాయాన్ని పక్కన పెట్టి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవామీ లీగ్​ నాయకత్వాన్ని, నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీటీ చీఫ్​ ప్రాసిక్యూటర్​ తాజుల్​ ఇస్లాం డిసెంబర్​ 22న హసీనాపై ఉద్దేశ్యపూర్వకంగా సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారని వాజిద్​ ఆరోపించారు. ఇంటర్​ పోల్​ రెడ్​ కార్నర్​ నోటీసు జారీ చేసిందని చెప్పడం పూర్తి అబద్ధమని రుజువైందన్నారు. బంగ్లాదేశ్​ లో జూలై, ఆగస్టుల్లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రతీ కేసును నిష్​పక్షపాతంగా దర్యాప్తు చేయాలని తాను డిమాండ్​ చేస్తున్నానన్నారు.