ఏటీఎం వాహనంపై దాడి ఇద్దరు మృతి
రూ. 93 లక్షల అపహరణ
బెంగళూరు: కర్ణాటక బీదర్ లో ఏటీఎం వాహనం సెక్యురిటీ సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడి రూ. 93 లక్షలను దోచుకున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఎస్ బీఐ ఏటీఎంలో డబ్బులు రీఫిల్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బందితో శివాజీ చౌక్ వద్దకు వచ్చింది. అక్కడే బైక్ పై ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా వాహనం వద్దకు వెళ్లి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది వెంకటేష్, శివలు మృతిచెందారు. దుండగులు రూ. 93 లక్షలను దోచుకొని పరారయ్యారు. కాగా సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. చుట్టుపక్కల రహదారుల్లన్నీ దిగ్భంధనం చేశారు. నేరస్థులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.