8వ వేతన సంఘం ఏర్పాటు శ్రీహరికోట మూడో ల్యాంచ్​ పాడ్​ కు కేబినెట్​ ఆమోదం

Establishment of 8th Pay Commission Cabinet approval for third launch pod of Sriharikota

Jan 16, 2025 - 16:11
Jan 16, 2025 - 16:11
 0
8వ వేతన సంఘం ఏర్పాటు శ్రీహరికోట మూడో ల్యాంచ్​ పాడ్​ కు కేబినెట్​ ఆమోదం

మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​ కు ముందు కేంద్ర ఉద్యోగులకు కానుక అందించింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రిమండలి గురువారం ఉదయం భేటీ అయ్యింది. భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ మీడియాకు వివరించారు. 8వ వేతన సంఘం ఏర్పాటు సిఫార్సులు 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. ఈ సిఫార్సులు డిసెంబర్​ 31తో ముగుస్తాయి.

8వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 34,560గా ఉండనుంది. ఈ కనీస వేతనంతో పోల్చుకుంటే ఆ ఉద్యోగి పెన్షన్​ 17,280+డిఆర్​ ను అందుకుంటాడు. అదే సమయంలో కేబినెట్​ సెక్రెటరీ హోదా ఉన్న ఉద్యోగుల మూలవేతనం రూ. 4.80 లక్షలు కానుంది. ఇందులో పెన్షన్​ 50 శాతం + డీఆర్​ ను అందించనున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం 2.57 శాతం వేతన సవరణ ఫిట్​ మెంట్​ ను ప్రకటించారు. అయితే 8వ వేతన సంఘంలో 1.92 శాతం నుంచి 2.86 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులు 8వ వేతన సంఘం ఆమోదంపై హర్షం ప్రకటించాయి. 

మూడో లాంచ్​ ప్యాడ్​ కు ఆమోదం..
 రూ. 3985 కోట్లతో శ్రీహరికోటలోని మూడో లాంచ్​ ప్యాడ్​ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రెండు లాంచ్​ పాడ్​ ల ద్వారానే ప్రయోగాలను నిర్వహిస్తున్నారు. మరో ల్యాంచ్​ ప్యాడ్​ నిర్మాణం చేపడితే మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధం కానుంది. మొదటి లాంచ్​ ప్యాడ్​ గత 30 ఏళ్లుగా, రెండో లాంచ్​ ప్యాడ్​ ద్వారా 20ఏళ్లుగా మిషన్​ లను ఇస్రో నిర్వహిస్తుంది.