కాల్పుల విరమణ ఒప్పందంపై అనుమానపు నీలినీడలు

Shadows of doubt over ceasefire agreement

Jan 16, 2025 - 15:14
 0
కాల్పుల విరమణ ఒప్పందంపై అనుమానపు నీలినీడలు

విశ్వసనీయత కొరవడిందన్న ఇజ్రాయెల్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇజ్రాయెల్​–హమాస్​ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా, ఖతార్​ లు ప్రకటించినా ఈ ఒప్పందంపై అనుమానపు నీలినీడలు కమ్ముకున్నాయి. బుధవారం కాల్పుల విరమణ ఆదివారం నుంచి అమలు కానుందని, ఇందుకు ప్రతీగా ఇజ్రాయెల్​ కు చెందిన 33 మంది బందీలను తొలివిడతగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఈ ఒప్పందంపై గురువారం ఇజ్రాయెల్​ ప్రధాని కార్యాలయం విభిన్న ప్రకటనను విడుదల చేసింది. బుధవారం జరిగిన ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్​ విధించిన చాలా షరతులకు హమాస్​ కట్టుబడి లేదని ఈ నేపథ్యంలో ఒప్పందంలో విశ్వసనీయత కొరవడినందున పూర్తి స్పష్టత లేదని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందంపై తమ దేశ క్యాబినెట్​ సమావేశం కాదని స్పష్టం చేసింది. కాగా అమెరికా, ఖతార్​ ఒప్పందం ప్రకటనను వెలువరించిన సమయంలో పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఖతార్​ షేక్​ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ సానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన ఒప్పందాన్ని తాను అంగీకరిస్తున్నారా లేదా అనేది నెతన్యాహు పేర్కొనకపోవటం గమనార్హం.