ఇరాన్​ సుప్రీంకోర్టులో కాల్పులు ఇద్దరు న్యాయమూర్తులు మృతి!

Two judges were killed in the firing in the Supreme Court of Iran!

Jan 18, 2025 - 16:45
 0
ఇరాన్​ సుప్రీంకోర్టులో కాల్పులు ఇద్దరు న్యాయమూర్తులు మృతి!

టెహ్రాన్​: ఇరాన్​  టెహ్​రాన్​ లోని సుప్రీంకోర్టులో శనివారం కాల్పులు జరిగాయి. ఈ దాడిలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు న్యాయమూర్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడులతో కోర్టులో హాహాకారాలు మొదలై న్యాయవాదులు, కోర్టులో ఉన్నవారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే లక్ష్యంగా దాడి జరిగినట్లు సమాచారం. దాడిచేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకునేందుకు రాగా అప్పటికే అతను తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మీడియా ప్రకారం సుప్రీంకోర్టు ఉద్యోగే కాల్పులకు పాల్పడ్డాడని తెలుస్తుంది. నిందితుడి కాల్పుల్లో మరో న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి.