ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
Two jawans were injured in IED blast
రాయ్ పూర్: బీజాపూర్ లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుటకేల్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన సిబ్బందిని వెంటనే ఎయిర్ లిఫ్ట్ ద్వారా రాయ్ పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తునారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చత్తీస్ గఢ్ లోని బస్తర్ డివిజన్ మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. ఈ ప్రాంతంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కేంద్రం సంకల్పించింది. అ నేపథ్యంలో పలు కార్యక్రమాలను కూడా అమలు చేస్తుంది. అయినా నక్సలైట్లు తమ ఉనికిని చాటుకునేందుకు అడపా దడపా భద్రతా దళాలు, పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. జనవరి 11న ఐఈడీ పేలుడులో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలయ్యాయి. జనవరి 12న జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.